Telugu Gateway
Cinema

‘జై సింహ’ టీజర్ విడుదల

నందమూరి బాలకృష్ణ 102వ సినిమా ‘జై సింహ’ టీజర్ విడుదల అయింది. బాలకృష్ణ అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేసే అంశాలు ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయి. బాలకృష్ణ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఒకటి..ఆయన అభిమానులు ఆకట్టుకుంటుందనటంలో సందేహం లేదు. 'సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు. సైలెంట్ గా ఉందని కెలికితే తల కొరికేస్తదంటూ' బాలకృష్ణ చెప్పిన మాస్ డైలాగ్ టీజర్ లో హైలెట్ గా నిలుస్తుంది.

దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన నయనతార, నాటాషా జోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎం రత్నం మాటలు అందిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది.

https://www.youtube.com/watch?v=LR7m8EiOFy0

Next Story
Share it