అనుష్క సందడి మొదలైంది
బాహుబలి 2 తర్వాత అనుష్క సినిమాలు ఏమీ కొత్తగా రాలేదు. చేస్తున్న సినిమా ఒక్కటే. అదే భాగమతి. ఈ మధ్యే ఫస్ట్ లుక్ వచ్చింది. బుధవారం నాడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తే బాహుబలి తొలి భాగంలో భయపెట్టిన తరహాలోనే ఇందులోనూ భయపెట్టేలా కన్పిస్తోంది. టీజర్ లో ఓ పాడుపడ్డ బంగ్లాతోపాటు...అనుష్క చేతిపై ఎవరో సుత్తి పెట్టి కొడుతున్నట్లు కన్పిస్తుంది. అదీ కూడా అలా వచ్చి ఇలా మాయం అవుతుంది. ఒకప్పుడు పూర్తి స్థాయి గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుష్క తర్వాత హీరోయిన్ ఒరియంటెడ్ సినిమాల్లో నటించి కూడా మంచి పేరు తెచ్చుకుంది.
ఇప్పుడు భాగమతి కూడా అలాంటి సినిమా తరహాలోనే ఉన్నట్లు కన్పిస్తోంది. గత కొంత కాలంగా అనుష్క కొత్త సినిమాలు ఏమీ అంగీకరించినట్లు కన్పించటం లేదు. ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు పలుమార్లు వచ్చినా అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. అయితే అనుష్క కొత్త సినిమాలు ఏమీ చేయకపోవటంతో ఆమె భవిష్యత్ ఎలా ఉండబోతున్నదా? అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
https://www.youtube.com/watch?v=Wj34yfjN0OA