అనుష్క కనుగొన్న కొత్త విషయం
అనుష్క ఈ మధ్య కొత్త విషయాన్ని కనుగొంది. అది ఏంటి అంటే తనకన్నా ఎత్తైన అమ్మాయిలు ఉన్నారని అంట. ఈ విషయాన్ని స్వయంగానే అనుష్కే సోషల్ మీడియా ద్వారా తెలిపింది. మామూలుగా అనుష్క మంచి హైట్. అందానికి అందంతో పాటు అభినయం..మంచి ఎత్తు ఉండబట్టే దశాబ్దకాలంపైగా టాలీవుడ్ తో పాటు పలు భాషల్లో సినిమాలు చేసి ఎంతో పేరు గడించింది ఈ స్వీటీ. తనకంటే పొడవున్న ఓ మహిళను కలిశానని చెబుతూ ఈ ఫోటోను కూడా సోషల్ మీడియాలో పెట్టారు. ఇది ఇఫ్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది.
ఈమె నాకన్నా పొడవున్నారు అని ఫోటో కింద క్యాప్షన్ పెట్టింది ఈ భామ. అయితే ఇది గతంలో ఎప్పుడో దిగిన ఫోటో అని..అందుకే జ్ణాపకాలు అని పెట్టినట్లు భావిస్తున్నారు. బాహుబలి 2 తర్వాత అనుష్క సందడి ఒకింత తగ్గిందనే చెప్పాలి. ఈ మధ్యే ఆమె నటిస్తున్న భాగమతి చిత్రం ఫస్ట్ లుక్ వచ్చింది. తర్వాత తాను సన్నపడ్డ ఫోటోలను కూడా అనుష్క ట్విట్టర్ లో షేర్ చేశారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భాగమతి సినిమా నవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.