Telugu Gateway
Politics

భార్య‌ను వ‌దిలేయండి..ప్ర‌ధానికండి

మూడుసార్లు త‌లాక్..త‌లాక్..త‌లాక్ అని చెప్ప‌టం ఎందుకు?. జైలుకు పోవ‌టం దేనికి. ఏమీ మాట్లాడ‌కుండా భార్య‌ను వ‌దిలేయండి. ఆ త‌ర్వాత దేశానికి ప్ర‌ధాని కండి. ఇదీ ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే ఆల్క లంబా చేసిన ట్వీట్ . ఈ ట్వీట్ ప్ర‌స్తుతం పెద్ద దుమార‌మే రేపుతోంది. కొద్ది రోజుల క్రిత‌మే లోక్ స‌భ‌ ట్రిపుల్ త‌లాక్ పై నిషేధం విధిస్తూ బిల్లు తెచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎవ‌రైనా చ‌ట్టాన్ని ఉల్లంఘించి ట్రిపుల్ త‌లాక్ చెపితే వారిని మూడేళ్ళు జైలులో పెట్టాల‌నే నిబంధ‌న కూడా బిల్లులో పెట్టారు.

దీనిపై గ‌త కొన్ని రోజులుగా పెద్ద దుమార‌మే రేగుతోంది. ఈ తరుణంలో ఆప్ కు చెందిన చాందినీ చౌక్‌ ఎమ్మెల్యే అల్క లంబ.. మోదీ వైవాహిక జీవితాన్ని ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ కొత్త వివాదంగా మారింది. ఈ ట్వీట్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ప్రధాని స్థాయిలో ఉన్న ఓ వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. మ‌రి బిజెపి డిమాండ్ పై ఆప్ స్పందిస్తుందా?. ఆల్క లంబా అయినా వివ‌ర‌ణ ఇస్తారో లేదో వేచిచూడాల్సిందే.

Next Story
Share it