‘పవన్’ బ్రూస్ లీకి మొగుడిలా ఉన్నాడు
ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా?. వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా విడుదలైన ‘అజ్ఞాతవాసి’ చిత్రాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ చేతులు కట్టుకుని నిలుచుని ఉణ్న పోస్టర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ ‘నేను గత జన్మలో కూడా ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న అతన్ని చూడలేదు. పవన్ కళ్యాణ్ ముందు రజనీకాంత్, అమితాబచ్చన్ ఎందుకూ పనికిరారు. మరో ఫోటోలో పవన్ మణికట్టుకుని పట్టుకుని ఉంటారు. దీన్ని వర్మ వదల్లేదు. ఇది చూసి పవన్ గొప్ప అందగాడు అని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ముందు పుట్టాడా? ఎమోషన్ ముందు పుట్టిందా ? చెట్టు ముందా విత్తు ముందా?, కోడి ముందా ? గుడ్డు ముందా ? అనే ప్రశ్నలకు సమాధానం చెపుతా అంటూ పవన్ ముందు పుట్టి అందరికీ ఇప్పుడు ఎమోషన్ నేర్పుతున్నాడంటూ వ్యాఖ్యానించారు.
పవన్ అందం గురించి వ్యాఖ్యానిస్తూ తాను స్వలింగ సంపర్కుడిని కాదనే విషయం ప్రపంచ వ్యాప్తంగా తెలుసున్నన్నాడు. అయితే ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరినీ ఒకవైపు పెట్టి అజ్ఞాతవాసి పోస్టర్‌లో ఉన్న పవన్‌కల్యాణ్‌ను మరో పక్కపెడితే తాను మాత్రం పవన్‌నే పెళ్లి చేసుకుంటానని పేర్కొన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో అజ్ఞాతవాసి’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయల్ నటించారు. ఈ సినిమా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.