Telugu Gateway
Cinema

కొత్త సంవత్సరంలో ‘ఆచారి సందడి’

కొత్త సంవత్సరంలో మంచు విష్ణు ‘ఆచారి’గా సందడి చేయటానికి రెడీ అవుతున్నాడు. మంచు విష్ణు,ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా జనవరి 26న విడుదల కానుంది. ఈ సినిమా అంతా పూర్తి కామెడీ ట్రాక్ తో నడవనుందని సమాచారం. ఆచారికి అమెరికాలో ఎదురైన అనుభవాలే సినిమాలో నవ్వులు పూయిస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ సినిమాను జనవరి 26న రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. నాగేశ్వర రెడ్డి–విష్ణు కాంబినేషన్‌లో ఇదివరకు ‘దేనికైనా రెడీ’ వంటి హిట్‌ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.

మళ్ళీ అదే రేంజ్‌ హిట్‌ ఖాయం అనే నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్‌. ఈ సినిమాలో బ్రహ్మానందం ఓ కీలక పాత్ర పోషించారు. ‘‘అమెరికా, మలేసియా, హైదరాబాద్‌లో షూటింగ్‌ చేశాం. సినిమా బాగా వచ్చింది. అన్ని వర్గాలవారినీ అలరించే విధంగా ఉంటుంది. విష్ణు, నాగేశ్వర రెడ్డికి మరో హిట్‌ ఖాయం అనే నమ్మకం ఏర్పడింది’’ అని చిత్ర సమర్పకుడు యం.యల్‌ కుమార్‌ చౌదరి తెలిపారు.

Next Story
Share it