Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు తల నరుకుతా అన్నా ఓకే..పార్టీలో చేరితే చాలా?

‘విలువలతో కూడిన రాజకీయాల కోసం. రాష్ట్రాభివృద్ధి కోసం. తెలుగు ప్రజల సంక్షేమం కోసం.రాత్రింబవళ్లు కష్ట పడి పనిచేస్తున్నా.కానీ కొంత మంది అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.’ ఇవీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిత్యం చెప్పే మాటలు. మన పార్టీలో చేరితో చాలు..ముఖ్యమంత్రి తల తెగ్గొస్తా అన్నా ఓకేనా...అదే కాదు..ఇంకా ఏమైనా అన్నా మాఫీనే. రాజకీయం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారని గతంలో ఎన్నోసార్లు నిరూపించారు కూడా. అధికారంలో ఉండగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రస్తుత టీడీపీ రాజ్యసభ టీ జీ వెంకటేష్..టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ లకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకటమే కాకుండా..కీలక పదవులు కూడా కట్టబెట్టారు. ఇప్పుడు మరో వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీలో చేరబోతున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గిడ్డి ఈశ్వరి టీడీపీలో లేకపోవటం వల్లే రాష్ట్ర అభివృద్ధి ఎక్కడికి అక్కడే ఆగిపోయింది. ఆమె టీడీపీలో చేరితే చాలా?. ఆమె గతంలో సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తల తెగ్గొస్తా అన్నా ఓకేనా?.

విశాఖలో బాక్సైట్ తవ్వకాలు జరపాలన్న చంద్రబాబు ప్రయత్నాలకు వ్యతిరేకంగా జరిగిన సభలో గిడ్డి ఈశ్వరి చేసిన కామెంట్స్ ఏంటో మీరూ ఓ సారి చూడండి. ‘ బాక్సైట్ జోలికొస్తే తల తెగ్గొస్తా. దమ్ముంటే బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా నేను రాజీనామా చేస్తా. మీ అభ్యర్థిని కూడా బరిలో నిలపండి. మీ అభ్యర్థికి డిపాజిట్లు వస్తే చూడండి. టీటీపీ అభ్యర్థి గెలిస్తే నేను రాజకీయాలు వదిలిపెట్టిపోతా?. మరి నేను గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా?. చంద్రబాబునాయుడు. వాడొక మోసకారి..వాడొక దగాకోరు.వెన్నుపోటు పొడిచి ఈ రోజు గిరిజనులను..ప్రజలుగా కాదు కదా..మనిషిగా కూడా గుర్తించేలేని దుస్థితిలో ఉన్నాడంటే వాడి అంతుచూడాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఇదే చంద్రబాబునాయుడు ఏమి చూసుకుని ఈ ప్రాంతానికి..మన అడవికి ..అత్యంత విలువైన ఖనిజ సంపదను దోచుకుపోవటానికి దొంగలా వస్తున్నాడని ప్రశ్నిస్తున్నా.’ అంటూ ఓ బహిరంగ సభలో ఆమె చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఇఫ్పుడు ఆమె తెలుగుదేశంలో చేరటానికి రెడీ అవటం..అందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిపోయాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరితే చాలు ఆంధ్రప్రదేశ్ ప్రగతి పరుగులు పెట్టడం ఖాయం. మరి గతంలో గిడ్డి ఈశ్వరి చంద్రబాబుపై చేసిన విమర్శలను తప్పుపట్టిన వారు ఏమి చేస్తారో చూడాలి.

Next Story
Share it