Telugu Gateway
Telangana

తెలంగాణ సర్కారుకు హైకోర్టులో మరో షాక్

సర్కారు ఏ నియామకాలు చేపట్టినా అది వివాదస్పదం కావటమే. మరి తెలిసి చేస్తున్నారో..లేక కావాలని చేస్తున్నారో తెలియదు కానీ..ఈ నియామకాల్లో తలెత్తే గందరగోళం మాత్రం నిరుద్యోగులను తీవ్ర నిరుత్సాహనికి గురిచేస్తోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎలాంటి కసరత్తు చేయకుండానే నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారా? లేక కారణం ఏంటి అన్న అంశంపై ఇప్పుడు నిరుద్యోగ యువతలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీచర్ల నియామకానికి సంబంధించి తెలంగాణ సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్ విషయంలో సర్కారుకు ఎదురుదెబ్బ తగలింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్‌టీ)కి సంబంధించి జీవో నెంబర్‌ 25ను సవరించి తీరాల్సిందేనని శుక్రవారం న్యాయస్థానం స్పష్టం చేసింది.

10 జిల్లాల ప్రకారమే టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఉండాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. పదిజిల్లాల ప్రాతిపదికన కాకుండా 31 జిల్లాల ప్రాతిపదికన పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యంపై పలుదఫాలుగా హైకోర్టులో విచారణ అనంతరం కోర్టు తుది తీర్పు వెలువరించింది. దీంతో ఇప్పుడు సర్కారు ఖచ్చితంగా నోటిఫికేషన్ లో మార్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీని వల్ల ఈ నియామకాల ప్రక్రియలో మరింత జాప్యం కానుంది. నోటిఫికేషన్ ప్రక్రియను డిసెంబర్ 15 వరకూ పొడిగించాలని హైకర్టు ఆదేశించింది.

Next Story
Share it