Telugu Gateway
Telangana

మంత్రుల ‘మెట్రో రైడ్’

తెలంగాణ మంత్రులు..ఎమ్మెల్యేలు..ప్రజా ప్రతినిధులు శనివారం నాడు ‘మెట్రో రైడ్’ చేశారు. ఈ నెల 28న హైదరాబాద్ లో ఈ ప్రతిష్టాత్మక మెట్రో సర్వీసులను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ మెట్రో రైడ్ అనంతరం తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కెటీఆర్ మీడియాతో మాట్లాడారు. మన మెట్రో.. మన నగరం.. నినాదంతో మెట్రో రైలు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అన్నారు. జంట నగరాలకు మెట్రో రైలు సర్వీసులు మణిహారం అని పేర్కొన్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెట్రో రైలును ప్రారంభిస్తారని, 29వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 29న ఉదయం 6 గంటలకు మొదటి రైలు ప్రారంభమవుతుందని తెలిపారు.

ప్రస్తుతం 57 రైళ్లు ఉన్నాయని, ప్రతి రైలుకు మొత్తం 3మూడు కోచ్‌లలో ...వెయ్యిమంది చొప్పున ప్రయాణించవచ్చని, 24 స్టేషన్లకు అనుసంధానం చేస్తూ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు, హైదరాబాద్‌ బైసైక్లింగ్‌ క్లబ్‌ సాయంతో మెట్రో స్టేషన్ల వద్ద సైకిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. స్మార్ట్‌ కార్డును జారీ చేశారని, వీటిద్వారా అనేక సేవలు పొందవచ్చన్నారు. మూడు నెలల వరకు రాత్రి 10 గంటల వరకే మెట్రో సేవలు ఉంటాయని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఉదయం 5.30 నుంచి రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇక రెండు రోజుల్లో టికెట్ల గురించి ప్రకటిస్తారని, సామాన్యుడికి అందుబాటులో టికెట్‌ ధరలు ఉంటాయని కేటీఆర్‌ వెల్లడించారు. మెట్రో ప్రాజెక్టు పూర్తి చేసే గడువుపై ఎల్ అండ్ టి, సర్కారు మధ్య విభేదాలు నెలకొన్నాయి. అన్ని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని కెటీఆర్ చెబుతున్నారు.

Next Story
Share it