ఓ డైరక్టర్ మందుకొట్టి నా గదికొచ్చాడు
సినిమాల్లో దర్శకుల తీరు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ మారింది. ఏ పరిశ్రమలో అయినా ఈ తీరు సహజమే అన్న రీతిలో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవకాశాల కోసం హీరోయిన్లను డైరక్టర్లు ఎలా వేధిస్తారో పలువురు ఇప్పటికే బహిర్గతం చేశారు. తాజాగా బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ సంచలన విషయాలు వెల్లడించారు. ఓ డైరక్టర్ మద్యం సేవించి తన గదికి వచ్చి కౌగిలించుకోవాల్సిందిగా ఓ సారి ఒత్తిడి చేసినట్లు తెలిపారు. అంతే కాదు తనతో లవ్..సెక్స్ వంటి విషయాలు మాట్లాడటానికి ప్రయత్నించేవాడని తెలిపారు. స్వరా భాస్కర్ వీరే ద వెడ్డింగ్ సినిమాలో కరీనా కపూర్, సోనమ్ కపూర్ లతో కలసి నటిస్తోంది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. తాను కొన్ని సార్లు భయంతో లైట్లు తీసేసి మేకప్ తీసుకున్న రోజులు ఉన్నాయని..లైట్ లేకపోతే నిద్రపోతున్నానని భావించి ఆ డైరక్టర్ వెనక్కి వెళ్లేవాడని తెలిపారు. సినిమాలోకి తీసుకునే సమయంలో కొంత మంది డైరక్టర్ల లైంగిక వేధింపులు గురిచేశారని తెలిపారు. అయితే చదవుకున్న అమ్మాయిగా వారి చర్యలకు అడ్డుతగలిలానని..ఈ కారణంగా చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోవలసి వచ్చిందని వెల్లడించారు.