Telugu Gateway
Telugu

మోడీకి ఊహించని షాక్

ప్రధాని నరేంద్రమోడీకి తన సొంత నియోజకవర్గం వారణాసిలోనే ఊహించని షాక్ తగిలింది. ఈ పరిణామాంతో బిజెపి శ్రేణులు ఒకింత నిరాశకు గురయ్యాయి. ఓ వైపు దేశంలో మోడీకి తిరుగులేదని బిజెపి ప్రకటనలు చేస్తున్న తరుణంలో ఆయన సొంత నియోకవర్గంలో జరిగిన పరిణామం మాత్రం కలకలం రేపుతోంది. మోడీ నియోజకవర్గంలోని మహత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్ యూనివర్శిటీ చాలా ప్రతిష్టాత్మకమైంది. ఈ ఎన్నికలను విద్యార్థి సంఘాలు చాలా ప్రాముఖ్యత ఇస్తాయి. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో బిజెపి అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ ఘోరపరాజయం చవిచూసింది. ఇక్కడ ఓ స్వతంత్ర అభ్యర్థి బరిలోకి దిగి విజయం సాధించారు.

ఏబీవీపీ తరపున వాల్మీకి ఉపాధ్యాయ బరిలో ఉండగా..సమాజ్ వాదీ ఛాత్ర సభ నుంచి టిక్కెట్ దక్కని కారణంగా రాహుల్ దుబే స్వతంత్రంగా బరిలోకి దిగారు. అయితే ఏంటి మంచి మెజారిటీతో విజయం దక్కించుకుని వార్తల్లో నిలిచారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న యూనివర్శిటీ ఎన్నికల్లో ఏబీవీపీ వరస పెట్టి పరాజయాలు మూటకట్టుకోవటం కూడా చర్చనీయాంశంగా మారుతోంది. పెద్ద నోట్ల రద్దుతోపాటు జీఎస్టీ ఎఫెక్ట్ తో మోడీ ప్రభ వెలుగు తగ్గుతోందని..ఈ మధ్య రాహుల్ జోరు పెంచటం కూడా కాంగ్రెస్ కు కలిసొస్తుందని చెబుతున్నారు.

Next Story
Share it