Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు షాక్..తెలంగాణకు ఫస్ట్ ప్లేస్

ముఖ్యమంత్రిగా కంటే సీఈవోగా పిలిపించుకోవటానికి ఇష్టపడే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాక్. సంస్కరణల విషయంలో..పరిపాలనలో పారదర్శకత..పారిశ్రామిక అనుమతుల మంజూరులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని చెప్పుకునే చంద్రబాబుకు ప్రపంచ బ్యాంకు నివేదిక షాక్ ఇచ్చింది. సులభతర వ్యాపార నిర్వహణ(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ )కు అవకాశం ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ నెంబర్ వన్ ప్లేస్ లో ఉండగా...ఆంధ్రప్రదేశ్ ఏకంగా 15వ స్థానానికి పడిపోయింది. హర్యానా రెండవ స్థానంలో, పశ్చిమ బెంగాల్ మూడవ స్థానంలో నిలిచాయి. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం..పారిశ్రామికంగా ఎంతో ముందున్న గుజరాత్ తొమ్మిదవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌ లో ఈ ఏడాది భారత్‌ మెరుగైన స్థానాన్ని కొట్టేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌-2018 జాబితాను మంగళవారం సాయంత్రం ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.

190 దేశాలున్న ఈ జాబితాలో ఇండియా 100 స్థానాన్ని దక్కించుకుంది. ఒకేసారి 30 స్థానాలను మెరుగుపర్చుకుని భారత్ 100 స్థానంలో నిలిచింది. దక్షిణ ఆసియాలో టాప్‌ 100లో చోటు దక్కించుకున్న దేశంగా ఇండియా నిలిచిందని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. నిర్మాణాత్మక సంస్కరణలను చేపడుతున్న దేశంగా భారతదేశం నిలిచిందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొందని జైట్లీ వెల్లడించారు. అయితే దేశంలోని నగరాల్లో హైదరాబాద్ కు రెండవ స్థానం దక్కింది. మొదటి ప్లేస్ లూథియానా చేజిక్కుంచుకుంది.

Next Story
Share it