Telugu Gateway
Cinema

శర్వానంద్ జోడీగా కాజల్..నిత్యామీనన్

టాలీవుడ్ లో వరస హిట్లు దక్కించుకుంటున్న హీరోల్లో శర్వానంద్. ఎంత పెద్ద హీరోలు పోటీలో నిలిచినా ప్రతి సీజన్ లో తన సినిమా విడుదల చేస్తూ సత్తా చాటుకుంటున్నాడు. అలాగే విజయాలు కూడా శర్వానంద్ కు తోడుగా నిలుస్తున్నాయి. దర్శకుడు సుధీర్ వర్మ, శర్వానంద్ కాంబినేషన్ లో కొత్త సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో శర్వానంద్ జోడీగా కాజల్, నిత్యామీనన్ లు నటించనున్నారు.

ఈ కొత్త సినిమాకు సంబంధించిన ముహుర్తపు సన్నివేశానికి అక్కినేని నాగచైతన్య క్లాప్ కొట్టారు. సోమవారం నాడు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఈ కార్యక్రమం జరిగింది. డిసెంబర్ నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Next Story
Share it