Telugu Gateway
Cinema

డిసెంబర్ 1న ‘జవాన్’

సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా నటించిన ‘జవాన్’ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబందించి ట్రైలర్ ను చిత్ర యూనిట్ ను విడుదల చేసింది. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు అయితే..ఈ సినిమాకు దర్శకత్వం వహించింది బీవీఎస్ రవి. గురువారం నాడు విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

ఈ సినిమాలో హీరో సాయిధరమ్ తేజ్ అక్టోపస్ మిస్సైస్ సిస్టమ్ ను కాపాడే జవాన్ గా నటిస్తారు. ఇందులో మరో విశేషం. నటి స్నేహ భర్త ప్రసన్న ఈ సినిమాలో విలన్ గా కన్పించబోతున్నారు. ట్రైలర్ రామ్ చరణ్ తేజ్ చెప్పిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు.

Next Story
Share it