Telugu Gateway
Telangana

కెసీఆర్ కు రేవంత్ సవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసీఆర్ కు దమ్ముంటే, తెలంగాణ బిడ్డవే అయితే కొడంగల్‌కు వచ్చి సమావేశం పెట్టు, మా కార్యకర్తల దమ్మేంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కోస్గిలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ స్థానిక నాయకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ..కేసీఆర్‌ చెంచా గుర్నాథ్ రెడ్డి గడీ మీద రెండు సార్లు జెండా ఎగరవేశామని అన్నారు. ఇప్పుడు తన మీద తాండూరులో ఓ చెల్లని రూపాయిని దింపి చెల్లిపిస్తాడని మాట్లాడుతున్నాడని కేసీఆర్‌నుద్దేశించి ఎద్దేవా చేశారు. డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రూ.250 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం తీసుకొచ్చానని తెలిపారు.

2007లో భీమా ప్రాజెక్టును తాము సాధించుకున్నామని, నేడు తమ మీద కక్షతో భీమా ప్రాజెక్టులు పూర్తి కాకుండా పక్కకు పెట్టారని రేవంత్‌ ఆరోపించారు. కొడంగల్ అభివృద్దిని అడ్డుకుంటుంది టీఆర్ఎస్ పార్టీనేనని ఆయన అన్నారు. నందారం వెంకటయ్య చివరి కోరిక కోస్గిలో బస్ డిపో నిర్మాణమని.. ఇందుకోసం తాను.. తన సోదరుడి పేరుమీద 4 ఎకరాలు కొనుగోలు చేసి అప్పగించామని..40 నెలలైనా ఎందుకు బస్ డిపో నిర్మాణానికి టెండర్లు పిలవడం లేదని రేవంత్‌ సూటిగా ప్రశ్నించారు.

Next Story
Share it