మార్తాండ వర్మగా రానా
దగ్గుబాటి రానా మరో కొత్త సినిమాకు ఓకే చెప్పేశారు. వినూత్నమైన కథలు ఎంచుకుని ముందుకు సాగుతున్న రానా తన ట్రెండ్ ను అలాగే కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఓ కొత్త కథకు ఓకే చెప్పేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బాహుబలి సినిమా ద్వారా చారిత్రక ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు రానా. అందుకే ఆయనకు అలాంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న సినిమానే దక్కింది.
కేరళలోని ట్రావెన్ కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ వర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న మహారాజ మార్తాండ వర్మలో రానానే హీరో. ఈ సినిమాకు సంబంధించి ప్రాధమిక పనులు ప్రారంభం అయ్యాయని..ఈ సినిమా కె . మధు దర్శకత్వంలో తెరకెక్కనుందని తెలిపారు. ఈ సినిమాకు రాబిన్ తిరుమల కథ అందించినట్లు రానా తెలిపారు.