అఫైర్లపై రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు
బహుశా అఫైర్లపై ఇంత బహిరంగంగా చెప్పిన హీరో ఎవరూ లేరనుకుంటా?. అది పెళ్లికి ముందు..పెళ్లి తర్వాత కూడా తనకు అఫైర్లు ఉన్నాయని హీరో రాజశేఖర్ బహిరంగంగా అంగీకరించటం పెద్ద సంచలనంగా మారింది. రాజశేఖర్ అఫైర్ల వ్యవహారంపై పరిశ్రమలో ఉన్న చాలా మందికి విషయం తెలిసినా..ఆయన ఓ ఇంటర్యూలో ఇలా అంగీకరించటం సంచలనంగా మారింది. రాజశేఖర్ హీరోగా చేసిన గరుడవేగ ఈ మధ్యే విడుదల అయి మంచి విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఓ వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో అఫైర్ల విషయాన్ని చాలా ఓపెన్ గా చెప్పేశారు. అదే సమయంలో ఓ అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రచారం జరుగుతున్నట్లు తారా చౌదరితో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజశేఖర్ స్పష్టం చేశారు.
ఆమె ఇంట్లో నా ఫొటో ఉండటం వల్లనే వివాదం మొదలైందని అన్నారు. నాతో ఫోటో తీసుకోవడానికి వచ్చిన సమయంలోనే తొలిసారి తారాచౌదరీని కలిశాను. ఆ తర్వాత ఆమె అద్దెకుంటున్న పక్క పోర్షన్ జీవితతోపాటు వెళ్లినప్పుడు మరోసారి కలిశాను. అంతేతప్ప ఆమె చెప్పినట్లు నాకు, ఆమెకు దగ్గరి సంబంధాలు లేవు. ఒకవేళ అలాంటిది ఏమైనా ధైర్యంగా నేను చెబుతాను’’ అని రాజశేఖర్ వ్యాఖ్యానించారు.. తాను కేవలం జీవితకి మాత్రమే భయపడతానే తప్ప ఇంకెవ్వరికీ భయపడనని ఆయన చెప్పారు. ‘పెళ్లికి ముందు అఫైర్లు ఉన్నాయి. జీవితతో పెళ్లి తర్వాత కొందరితో సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే అవి యాక్సిండెట్‌గా జరిగినవే’’ అని రాజశేఖర్ తెలిపారు.