Telugu Gateway
Cinema

రాజమౌళి సినిమాలో విలన్ ఎన్టీఆరా? రామ్ చరణా!

ఒక్క ఫోటో. ఎన్నో వార్తలు. ఎన్నో సంచలనాలు. చివరకు ఇది ఏదో ఫ్రెండ్లీగా దిగిన ఫోటోనే కాదు. దీని వెనక చాలా పెద్ద కథే ఉంది అని తేలిపోయింది. అదేనండి రాజమౌళి..జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలసి దిగిన ఫోటో వ్యవహారం. ఇప్పటికే తాను నిర్మాత దానయ్యతో సినిమా చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించారు. అయితే ఈ సినిమానే మల్టీస్టారర్ అని..అందులోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించనున్నట్లు తేలిపోయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల్లో ఒకరిది విలన్ క్యారెక్టర్ ఉంటుందని..అయితే అది ఎవరన్నది మాత్రం తేలాల్సి ఉందని చెబుతున్నారు. ఈ మధ్యే జైలవ కుశ సినిమాలో రావణుడి పాత్రలో ఎన్టీఆర్ దుమ్మురేపిన సంగతి తెలిసిందే. అయితే మరి ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఎన్టీఆర్ చేస్తారా? లేక రామ్ చరణా అన్నది మాత్రం తేలాల్సి ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఇద్దరు టాప్ హీరోల్లో..అదీ మల్టీస్టారర్ సినిమాలో ఒకరు విలన్ అంటే ఇక చూస్కోండి ఎలా ఉంటుందో మజా.

అయితే ఇద్దరు టాప్ హీరోల సినిమాల్లో ఒకరు విలన్ గా ఖాయం అయితే వారి అభిమానుల స్పందన ఎలా ఉంటుందా? అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. కానీ ఫ్యాన్స్ మధ్య అప్పుడప్పుడు మాటల యుద్ధం సాగుతుంటుంది. మరి ఈ వార్త అధికారికం అయితే ఫ్యాన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటాయో వేచిచూడాల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మల్టీస్టారర్ కు సంబంధించి ఇఫ్పటికే పలు వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ సినిమాకు యమధీర టైటిల్ కూడా ఖరారు చేసేశారు సోషల్ మీడియాలో అయితే.

Next Story
Share it