Telugu Gateway
Cinema

దుమ్మురేపుతున్న రాయ్ ల‌క్ష్మీ

రాయ్ ల‌క్ష్మీ. టాలీవుడ్ లో ఆమె పేరు తెలియ‌ని వారుండ‌రు. రాయ్ ల‌క్ష్మీ కంటే ల‌క్ష్మీరాయ్ అన్నా కూడా గుర్తుపడ‌తారు. ఎందుకంటే ఆమె అస‌లు పేరు అదే క‌దా. అందానికి అందం..అభిన‌యానికి అభిన‌యం ఉన్నా కాలం క‌ల‌సిరావ‌టంలేద‌ని ఈ భామ పేరు మార్చుకుంది. పేరు మార్పు త‌ర్వాత సినిమాల్లో అవ‌కాశాలు కూడా బాగానే వ‌స్తున్నాయి. అంతే కాదు..యూ ట్యూబ్ లో అయితే ఆమె దుమ్మురేపుతోంది. దీంతో రాయ్ ల‌క్ష్మీ అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. సోషల్‌ మీడియాలోను ఆమె పాటలు, ట్రైలర్ల వీడియోలు పెద్ద ఎత్తున హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఒక్క ఏడాదిలోనే ఓవరాల్‌గా ఆమెకు సంబంధించిన ఈ వీడియోలు ఏకంగా 5.5 కోట్ల వ్యూస్‌ సంపాదించుకోవడం విశేషం. దీంతో ఆమె యూట్యూబ్‌ క్వీన్‌ అంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. చిరుతో క‌ల‌సి ఖైదీ నెంబర్‌ 150లో ఆయన సరసన ‘రత్తాలు రత్తాలు..’ అంటూ చిందులేసింది ఈ భామ‌.

ఈ పాటకు 12మిలియన్ల (1.2కోట్లు) వ్యూస్‌ వచ్చాయి. రాయ్‌లక్ష్మీ ఎంతో స్లిమ్‌గా మారడంతో పాటు గ్లామర్‌ రూటు మార్చి నటించిన చిత్రం జూలీ2 ట్రైలర్లు ఆమె బోల్డ్‌నెస్‌తో యూ ట్యూబ్ లో హల్‌చల్‌ చేశాయి. ఈ మూవీ టీజర్‌ 89 లక్షల వ్యూస్‌తో సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసింది. ట్రైలర్‌-1ను 6.7 మిలియన్ల మంది చూడగా, ట్రైలర్‌-2కు 4.7 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. హరహరమహాదేవకి- 15 మిలియన్లు, ఓ జూలీకి 2.3 మిలియన్లు, కోయి హౌస్లాకు-1.9 మిలియన్లు, మలా సీన్‌హాకు 3.6 మిలియన్ల వీక్షకులతో 2017లో రాయ్‌లక్ష్మీ జోరు అంటూ సంద‌డి చేస్తున్నారు. ఈ ప్ర‌చారంతో రాయ్ ల‌క్ష్మీ స్పీడ్ మ‌రింత పెర‌గ‌టం ఖాయంగా క‌న్పిస్తోంది.

Next Story
Share it