Telugu Gateway
Cinema

పంజాబ్ లో ‘పూరీ బ్యాచ్ హంగామా’

మొహబూబా చిత్ర యూనిట్ ప్రస్తుతం పంజాబ్ లో హంగామా చేస్తోంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు స్ట్రీట్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తోంది. అంతే కాదు..అక్కడే దర్శకుడు పూరీ జగన్నాధ్, చిత్ర నిర్మాణ బాధ్యతలు చూస్తున్న చార్మి కౌర్ హోటళ్ళ దగ్గరే డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఆ వీడియోను వీరు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.

పూరీ జగన్నాధ్ బాలకృష్ణతో పైసా వసూల్ సినిమా తర్వాత తన కొడుకు ఆకాష్ ను రీ లాంచ్ చేస్తూ పాకిస్థాన్ కు చెందిన ప్రేమ కథ ఆదారంగా మొహబూబా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బెంగుళూరుకు చెందిన నేహాశెట్టి హీరోయిన్ గా ఆకాష్ తో జోడీ కట్టింది.

Next Story
Share it