కెసీఆర్ సర్కారుపై టీఆర్ ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల వేడి సమీపిస్తున్న తరుణంలో చలికాలంలోనూ రాజకీయ వేడి పెరుగుతోంది. టీఆర్ ఎస్ ప్రభుత్వంపై ఆ పార్టీ నేత పోట్ల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కెసీఆర్ పాలన నిజాం ఏలుబడిని తలపిస్తోందని విమర్శించారు. సచివాలయానికి రాకుండా ఉన్న ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.ఆయన శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. టీఆర్ ఎస్ పార్టీలో ఇమడలేకపోతున్నట్లు వ్యాఖ్యానించారు. త్వరలోనే రాహుల్ గాంధీ సమక్షమంలో కాంగ్రెస్ లో పార్టీ లో చేరుతున్నట్లు ప్రకటించిన పోట్ల నాగేశ్వరరావు.. తనకు రాజకీయ ఓనమాలు నేర్పింది నందమూరి తారక రామారావు అన్నారు .
తెలంగాణ ప్రభుత్వం మాటలకే తప్ప చేతలు లేవు..35ఏళ్లలో ఇలాంటి దౌర్బాగ్య మైన ప్రభుత్వం ఎక్కడా చూడలేదన్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి.. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రోత్సాహంతో పోట్ల నాగేశ్వరరావు పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వారం క్రింత పోట్ల వీరిద్దరితో ఆయన భేటీ అయ్యారు. పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరితే పార్టీ పరంగా జిల్లాస్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఆయన అనుచరులు భావిస్తున్నారు.