Telugu Gateway
Cinema

ప‌వ‌న్ కొత్త సినిమా విడుద‌ల జ‌న‌వ‌రి 10న‌

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ కు పండ‌గ‌లాంటి వార్త ఇది. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్క‌తున్న కొత్త సినిమా సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌నుంది. అంతే కాదు..సినిమా విడుద‌ల తేదీని జ‌న‌వ‌రి 10గా నిర్ణయించిన‌ట్లు స‌మాచారం. అంతే కాదు మంగ‌ళ‌వారం నాడు త్రివిక్ర‌మ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఓ పాట‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ సినిమాలో ప‌వ‌న్ కు జోడీ కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయ‌ల్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే .

అనిరుధ్‌, ర‌విచందర్‌ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. వీడియో రిలీజ్‌ అయిన అరగంటలోనే ఈ పాటకు లక్షకు పైగా వ్యూస్‌ రావటం విశేషం. ఈ సినిమాను హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధకృష్ణ నిర్మిస్తున్నారు. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25వ సినిమా కావ‌టం విశేషం. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జోరుగా సాగుతోంది. కొత్త‌గా విడుద‌ల చేసిన పాట‌లో రాత్రి 12 గంటలకు ‘బయిటికొచ్చి చూస్తే’ సాగిపోతుంది పాట‌. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25వ సినిమా కావ‌టం విశేషం.

కొత్త పాట లింక్ ఇదే

https://www.youtube.com/watch?v=JXIiQFSj8Yg

Next Story
Share it