Telugu Gateway
Cinema

లండన్ లో పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన వైపు సినిమాలు..మరో వైపు రాజకీయాల్లో హంగామా చేస్తూనే మరోవైపు ఎప్పటి నుంచో ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం వంటి సమస్యను కూడా టేకప్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు తాజాగా లండన్ కు చెందిన ఓ సంస్థ అవార్డు కూడా ప్రకటించింది. బ్రిటన్‌లోని హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో ఇండో- యూరోపియన్ బిజినెస్ ఫోరం గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డుని అందుకునేందుకు ఆయన లండన్‌ వెళ్ళారు.

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి పవన్ చేసిన కృషికి గుర్తింపుగా శుక్రవారం ఈ అవా‍ర్డు దక్కనుంది. కళలు, రాజకీయాలు, సామాజిక కార్యక్రమాల్లో విశేష కృషిగాను హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ లో ప్రఖ్యాత ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ ఈ అవార్డును పవన్‌కు ప్రదానం చేయనుంది.

Next Story
Share it