Telugu Gateway
Cinema

'అజ్ఞాతవాసి' ఫస్ట్ లుక్ వచ్చేసింది

పవన్ కల్యాణ్ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ కూడా ఖరారు అయింది. ఇప్పటివరకూ ప్రచారంలో ఉన్న 'అజ్ఞాతవాసి' పేరే ఫైనల్ అయింది. అంతే కాదు..ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'అజ్ఞాతవాసి' సినిమా పవన్ కళ్యాణ్ 25వ సినిమా కావటం విశేషం.

ఈ సినిమాలో కీర్తీ సరేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నట్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని హారికా హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్ర షూటింగ్‌ చివరి షెడ్యూల్‌ వారణాశిలో జరుగుతోంది.

Next Story
Share it