Telugu Gateway
Cinema

‘పద్మావతి’పై నిషేధానికి సుప్రీం నో

పద్మావతి సినిమా రగడ ఆగటం లేదు. అయితే ఈ సినిమాపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ ఈ మేరకు తీర్పునిచ్చింది. సెన్సార్ బోర్డుకు ఉన్న అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. సీబీఎస్‌సీ ఇంకా సర్టిఫికెట్ ఇవ్వక ముందే సినిమా విడుదలను ఎలా ఆపేస్తామని ప్రశ్నించింది. సీబీఎఫ్‌సీ నుంచి పద్మావతికి సర్టిఫికేషన్‌ రావాల్సి ఉందని పేర్కొంది.

పద్మావతి సినిమా విడుదలపై నిషేధం విధించాలంటూ అడ్వకేట్‌ ఎంఎల్‌ శర్మ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ ఇప్పటికే ఈ చిత్ర దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీ, హీరోయిన్‌ దీపికా పదుకొనేలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. సినిమా విడుదల నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా రాజ్‌పుత్ కర్ణిసేన ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ స్వచ్ఛందంగా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది.

Next Story
Share it