Telugu Gateway
Cinema

‘బాలకృష్ణుడు’ ఈ నెల 24న

నారా రోహిత్..రెజీనా జంటగా నటించిన ‘బాలకృష్ణుడు’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 24న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన సినిమా టీజర్ చూసిన వారికి నారా రోహిత్..రెజీనాల రొమాన్స్ డోస్ పెరిగినట్లు కన్పించింది. ఈ వ్యవహారం పెద్ద సంచలనంగానే మారింది. ఈ సినిమాలోమరో ప్రత్యేకత ఉంది. దీనికి సీనియర్ నటుడు జగపతిబాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. పూర్తి స్థాయి వాణిజ్య హంగులతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు మల్లెల పవన్ దర్శకుడుగా వ్యవహరించారు.

Next Story
Share it