Top
Telugu Gateway

అదిరేలా ఆ విమానాలు..బెడ్స్..వార్డ్ రోబ్స్

ఇప్పుడు ఆ విమానం ఎక్కితే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది. ఎందుకంటే అక్కడ పడుకోవటానికి బెడ్ ఉంటుంది. కూర్చోవటానికి ఓ విలాసవంతమైన కుర్చీ ఉంటుంది. అంతే కాదు..వార్డ్ రోబ్స్..రెండు బాత్ రూమ్ లు.. 32 అంగుళాల హెచ్ డీ క్వాలిటీ టీవీ స్క్రీన్. అసలు ఏ 380 విమానం అంటేనే విలాసాలకు కేరాఫ్ అడ్రస్. ఈ డబుల్ డెక్కర్ విమానాలు అయిన ఏ 380లో సింగపూర్ ఎయిర్ లైన్స్ మరింత లగ్జరీని అందుబాటులోకి తెచ్చింది. సింగపూర్ ఎయిర్ లైన్స్ లోని ఫస్ట్ క్లాస్ క్యాబిన్స్ లో ఓ బెడ్ తోపాటు వార్డ్ రోబ్స్ సౌకర్యం కూడా కల్పించారు కొత్తగా. ఈ సౌకర్యంతో కూడిన విమానాలు నవంబర్ 3వ తేదీ నుంచే అందుబాటులోకి వచ్చాయి. దీని కోసం విమానాంలో సౌకర్యాలను రీడిజైన్ చేశారు. మార్పులతో అందుబాటులోకి వచ్చిన ఏ 380లో 471 మంది ప్రయాణించవచ్చు.

మామూలుగా అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుంది కానీ..మార్పులు చేసినందున సీట్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సో...ఇందులో ప్రయాణించాలంటే ఛార్జీలు కూడా అంతే అధికంగా ఉంటాయనుకోండి. డబుల్ డెక్కర్ విమానాల్లోని మధ్య భాగంలో సకల సౌకర్యాలతో బార్ సౌకర్యం కూడా ఉంటుంది. అంటే ఆకాశంలో ప్రయాణిస్తూ అలా ఫ్రెండ్స్ తో కూర్చుని ఎంచక్కా మందు కూడా కొట్టొచ్చు. అంతర్జాతీయ రూట్లలో మద్యం సరఫరా సహజంగానే ఉంటుంది. అయితే అది ఎవరి సీట్లలో వారు కూర్చుని డ్రింక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఏ 380లో మాత్రం ఈ సౌకర్యాలే వేరు.

Next Story
Share it