Telugu Gateway
Telugu

యువకుడిపై యువతి అత్యాచారం

ఆ అబ్బాయి వయస్సు 17 సంవత్సరాలు. అమ్మాయి వయస్సు 24 సంవత్సరాలు. అబ్బాయిని కిడ్నాప్ చేయటమే కాకుండా..అతగాడిపై అత్యాచారం చేసింది. ఈ వ్యవహారం పోలీసు స్టేషన్ వరకూ వెళ్ళటం..యువతిపై కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. ఈ ఘటన ఐటి రాజధాని బెంగుళూరులో జరిగింది. అత్యాచారం చేశారన్న అభియోగంపై 24 ఏళ్ల యువతిని పోలీసులు అదువులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ అయిన యువతికి భర్తతో పాటు ఇద్దరు పిల్లలున్నట్లు సమాచారం. బాధిత యువకుడు, యువతి ఇద్దరూ బెంగళూరులోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌)కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

అత్యాచారానికి పాల్పడిన యువతిపై ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫెన్సెస్‌ (లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. లైంగిక చర్య జరింగిందనే విషయంపై యువతీ, యువకులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడిపై బలాత్కారం చేసిన యువతి భర్త.. ఒక డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయిర్‌గా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.

Next Story
Share it