Telugu Gateway
Cinema

కీర్తి సురేష్ కొత్త మార్క్

టాలీవుడ్ లో ఆమె చేసింది చాలా తక్కువ సినిమాలే. కానీ గుర్తింపు మాత్రం చాలా ఎక్కువే అని చెప్పొచ్చు. టాప్ హీరోయిన్లు కూడా రెచ్చిపోయి ఎక్స్ పోజింగ్ చేస్తున్న తరుణంలో కీర్తి మాత్రంఎక్కడా హద్దులు దాటకుండా..పద్దతిగా కన్పిస్తూ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అయినా సరే ఆమెకు అభిమానులు పెరుగుతూ పోతున్నారు. ఓ వైపు తెలుగులో దూసుకెళుతూనే మరో వైపు తమిళ పరిశ్రమలోనూ సత్తా చాటుతోంది. తాజాగా కీర్తి సురేష్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.

అది ఏంటి అంటే తన ట్విట్టర్ ఖాతాలో ఫాలోయర్లు 10 లక్షలు(1 మిలియన్) మార్క్‌ ను గురువారం చేరుకున్నారు. 'గత నాలుగేళ్లుగా నన్ను ఎంతగానో ఆదరించారు. నేడు 1 మిలియన్ మార్క్ చేరుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. 5వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాను. మరెంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. నాకు మద్ధతు ఇచ్చిన వారికి, ఆశీర్వదించిన వారికి ధన్యవాదాలు' అంటూ తన సినిమాల్లోని కొన్ని స్టిల్స్‌ ఉన్న ఓ ఫొటోను షేర్ చేసింది.

Next Story
Share it