వివాదంలో జ్యోతిక
హీరోయిన్ జ్యోతిక వివాదంలో ఇరుక్కున్నారు. ఓ సినిమాలో ఆమె చెప్పిన డైలాగులే ఈ వివాదానికి కారణం అయ్యాయి.ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదంగా మారింది. పెళ్లి తర్వాత జ్యోతిక రీ ఎంట్రీ సినిమానే ఇలా వివాదంలో కూరుకోవటం ఆమెను షాక్ కు గురిచేసిందని అంటున్నారు. ఆమె వయదినిలే చిత్రంతో నటిగా రీఎంట్రీ అయిన విషయం తెలిసిందే. ఇటీవల తెరపైకి వచ్చిన మగళీర్ మట్టుం చిత్రంలోనూ ప్రధాన పాత్రను పోషించారు. చాలా కాలం తరువాత బయటి సంస్థలో నాచియార్ అనే చిత్రంలో నటిస్తున్నారు. హీరోగా జీవీ.ప్రకాశ్‌కుమార్ నటిస్తున్న ఈ చిత్రానికి బాలా దర్శకుడు.
ఈ చిత్ర టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. నటి జ్యోతిక పోలీస్ అధికారిణిగానూ, జీవీ.నేరస్తుడిగానూ నటిస్తున్న చిత్రం నాచియార్. ఇందులో జ్యోతిక పోలీస్‌స్టేషన్‌లో కొందరిపై అసభ్య పదజాలంతో తిట్టిన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. దీంతో విమర్శకులు, నెటిజన్లు అలాంటి సంభాషణలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ప్రచారం కోసమే చిత్రాల్లో ఇలాంటి బూతులు పొందుపరుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెన్సార్ సభ్యులైనా ఇలాంటి అసభ్య సంభాషణలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.