‘డిటెక్టివ్ ఎన్టీఆర్’!
ఇది టైటిల్ కాదు. ఎన్టీఆర్ కొత్తగా చేయబోయే సినిమాలో ఆయన పాత్ర. అవును మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ఎన్టీఆర్ ది డిటెక్టివ్ రోల్ అని..ఓ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కతున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాకపోతే ఈ రోల్ పై టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ కావటంతో కొత్త సినిమాపై కూడా ఆయన అభిమానులు భారీ ఆశలే పెట్టుకోవటం సహజం.
అందునా డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కావటంతో ఇది మరింత హైప్ కు వెళుతుంది. ఈ సినిమా 2018 ప్రారంభంలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన అ..ఆ.. సినిమా కూడా నవల ఆధారంగా తెరకెక్కిన సినిమానే కావటం విశేషం. ఈ దర్శకుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ సినిమా పట్టాలు ఎక్కనుంది.