Telugu Gateway
Cinema

భద్రాచలంలో జూనియర్ ఎన్టీఆర్

టాలీవుడ్ లో వరస హిట్లతో దూసుకెళుతున్న జూనియర్ ఎన్టీఆర్ శుక్రవారం నాడు భద్రాచలంలో సందడి చేశారు. ఆయన ముఖ్యంగా భద్రాచల ఆలయ దర్శనం కోసమే వచ్చినట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో కలసి ఎన్టీఆర్ సీతారాముల్ని దర్శించుకున్నారు. భద్రాద్రికి విచ్చేసిన ఎన్టీఆర్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు.

ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆలయ విశేషాలు వివరించారు. దసరా కానుకగా విడుదలైన జై లవకుశ ఘన విజయం సాధించింది. బాల నటుడిగా జూనియర్‌ ఎన్టీఆర్‌ రామాయణం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా కుటుంబ సభ్యులతో కలిసి రాములవారి సేవలో పాల్గొన్నారు.

Next Story
Share it