Telugu Gateway
Telangana

తొలి రోజు ‘హైదరాబాద్ మెట్రో’ టర్గెట్ లక్ష

హైదరాబాద్ లో మెట్రో రైలు సందడి మొదలైంది. బుధవారం ఉదయం నుంచే చాలా మంది తొలి రోజే మెట్రో ప్రయాణ అనుభూతిని పొందేందుకు రైలు ప్రయాణం చేశారు. కొంత మంది అవసరాలకు అనుగుణంగా ప్రయాణం చేయగా..చాలా మంది తొలి రోజు మెట్రో ప్రయాణం చేయాలనే కోరికతో పొద్దున్నే రైలు ఎక్కారు. ఇందులో ఎక్కువ శాతం యువత ఉంది. చాలా చోట్ల పెద్దవాళ్ళు..మార్నింగ్ వాక్ కు వచ్చిన వాళ్ళు కూడా సరదాగా దగ్గర స్టేషన్ల వరకూ ప్రయాణించి..మళ్ళీ వెనక్కు వచ్చారు. అయితే తొలి రోజే హైదరాబాద్ లో లక్ష మంది మెట్రో లో ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

బుధవారం ఉదయం సరిగ్గా ఆరు గంటలకు మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి రైలు బయలుదేరింది. ప్రతి పదిహేను నిమిషాలకు ఓ సారి మొత్తం పద్దెనిమిది రైళ్ళు తిరగనున్నాయి. మెట్రో స్మార్ట్ కార్డుల విక్రయం కూడా జోరుగా సాగుతోంది. తొలి మూడు రోజుల్లోనే 12 వేల కార్డులను విక్రయించారు. బుధవారం నుంచి ఇవి మరింత జోరందుకుంటాయని భావిస్తున్నారు. మియాపూర్-నాగోలు మధ్య 24 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. బస్సులతో పోలిస్తే మెట్రో ప్రయాణం చాలా స్పీడ్ గా ఉండనుండటంతో ప్రయాణికులు ఈ మార్గం వైపు మారతారని భావిస్తున్నారు

Next Story
Share it