అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు సెట్లు కాలిబూడిద అయ్యాయి. ఇందులో అక్కినేని నాగేశ్వరరావుకు చెందిన పాత జ్ణాపకాలతో కూడిన మనం సెట్ తో పాటు..పలు కొత్త సినిమాలో షూటింగ్ ల కోసం ఏర్పాటు చేసిన సెట్లు కూడా తగలపడ్డాయి. ఈ ప్రమాదం లో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవటంతో అందరూ ఊఫిరిపీల్చుకున్నారు.
అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న తర్వాత నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది మంటలు అదుపు చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన అక్కడి చేరుకున్న నాగ్ మీడియాతో మాట్లాడారు. నాగేశ్వరావు జ్ఞాపకార్థం నిలుపుకున్న మనం సినిమా సెట్‌తోపాటు.. చిరు సైరా నరసింహారెడ్డి కోసం వేసిన ఓ సెట్ కాలిపోయినట్లు తెలిపారు. షార్ట్ సర్కూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.