Telugu Gateway
Telangana

హైద‌రాబాద్ లో భూ ప్ర‌కంప‌న‌లు..క‌ల‌క‌లం

ఒక్క‌సారిగా క‌ల‌క‌లం. బుధ‌వారం ఉద‌యం జూబ్లిహిల్స్ ప్రాంతంలో స్వ‌ల్ప భూ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భ‌వ‌న్ ఎదురుగా ఉన్న కెబీఆర్ పార్కు కేంద్రంగా భూ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. అయితే ఈ భూ ప్ర‌కంప‌న‌ల‌తో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఎన్టీఆర్ రికార్డుల ప్ర‌కారం రిక్ట‌ర్ స్కేల్ పై భూ కంప తీవ్రంగా చాలా స్వ‌ల్పంగానే ఉంది.

ఈ ప్ర‌భావం .03-0.5 మ‌ధ్య ఉంటుంద‌ని తెలిపారు. భారీ వర్షాల త‌ర్వాత భూగ‌ర్భ జ‌లాలు గ‌ణ‌నీయంగా పెరిగిన స‌మ‌యంలో ఇలాంటి ప్ర‌కంప‌న‌లు స‌హ‌జంగా అని ఎన్ జీఆర్ ఐ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఈ ప్ర‌కంప‌నల కార‌ణంగ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

Next Story
Share it