Telugu Gateway
Telugu

మూడు లక్షల కేజీల విమానాన్ని లాగి పడేశారు

ఆ విమానం బరువు మూడు లక్షల రెండు కిలోలు. అది ఎమిరేట్స్ కు చెందిన డబుల్ డెక్కర్ విమానం ( ఏ 380). కానీ 56 మంది పోలీసులు ఈ విమానాన్ని ఓ వంద మీటర్ల మేర ఈజీగా లాగి పడేశారు. ఇది ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నమోదు అయింది. ఈ ఫీట్ సాధించిన దుబాయ్ పోలీసు అధికారులకు ప్రశంసలు దక్కుతున్నాయి. గురువారం నాడే ఈ ఘటన జరిగింది.

గతంలో హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 100 మంది వ్యక్తులు 2.18 లక్షల కిలోల బరువు ఉన్న విమానాన్ని లాగారు. ఇది 2011 లో జరిగింది. తాజాగా దుబాయ్ పోలీసుల ఫీట్ తో పాత రికార్డు చెరిగిపోయింది. కొత్త రికార్డు వీరి పేరు మీద నమోదు అయింది. 30 రోజుల ఫిట్ నెస్ ఛాలెంజ్ ప్రోగ్రాంలో భాగంగా పోలీసులు ఈ రికార్డు కోసం ప్రయత్నించి సఫలమయ్యారు.

Next Story
Share it