Telugu Gateway
Andhra Pradesh

హైదరాబాద్ పై నా ముద్ర చెరిపేస్తే చెరిగేది కాదు

ఇవి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు. హైదరాబాద్ లో అట్టహాసంగా సాగుతున్న గ్లోబర్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ (జీఈఎస్), మెట్రో రైలు ప్రారంభోత్సవంపై చంద్రబాబు అమరావతి అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా హైదరాబాద్ పై తన ముద్ర చెరిపేస్తే చెరిగేదికాదని వ్యాఖ్యానించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు కట్టించిన హెచ్ఐసిసిలోనే జీఈఎస్ జరుగుతోందని అన్నారు. మెట్రో రైలు హైదరాబాద్ వచ్చేందుకు తాను కృష్టి చేశానని..తొలుత జాబితాలో హైదరాబాద్ పేరులేదని..తన ఒత్తిడి వల్లే హైదరాబాద్ పేరు చేర్చారని చెప్పారు. తన తర్వాత తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మెట్రోను ఆలస్యం చేశారని ఆరోపించారు. అందుకే ఇంతకాలం పట్టిందని అన్నారు. అప్పట్లోనే తాను ఢిల్లీ మెట్రో శ్రీధరన్‌తో హైదరాబాద్‌ మెట్రోపై అధ్యయనం చేయించానని తెలిపారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు అంతా సిద్ధం చేసింది కూడా తానేనని తెలిపారు. తాను ప్రారంభించినా...ప్రారంభించకున్నా...హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామన్న సంతృప్తి మాత్రం తనకుందని వ్యాఖ్యానించారు. అలైన్ మెంట్ మార్పు పేరుతో రెండేళ్ళు మెట్రో పనుల జాప్యానికి కారణమైన తెలంగాణ సీఎం కెసీఆర్ ను మాత్రం చంద్రబాబు పల్లెత్తు మాట అనకపోవటం విశేషం.జీఈఎస్ కు హాజరైన పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుకునేందుకు చంద్రబాబు సర్కారు మంగళవారం నాడు ప్రముఖ ఆంగ్ల పత్రికలో రెండు పేజీల భారీ ప్రకటన ఇఛ్చిన విషయం తెలిసిందే .

Next Story
Share it