బిత్తిరి సత్తిపై దాడి..ఆస్పత్రికి తరలింపు
తెలంగాణలో ఎంతో పాపులర్ అయిన యాంకర్ బిత్తిరి సత్తిపై సోమవారం ఆకస్మిక దాడి జరిగింది. అదీ ఆయన పనిచేసే వీ6 ఛానల్ ముందే కావటం విశేషం. తీన్మార్ వార్తలతో బిత్తిరి సత్తి అందరికీ సుపరిచితుడుగా మారిన విషయం తెలిసిందే. V6 చానల్ కార్యాలయం ఎదుట హెల్మెట్‌తో గుర్తు తెలియని వ్యక్తులు సత్తిపై దాడి చేశారు. చికిత్స నిమిత్తం బిత్తిరి సత్తిని బంజారాహిల్స్ లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ దాడికి పాల్పడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా నినాదాలు చేసుకుంటూ వెళ్ళాడని చెబుతున్నారు.
హైదరాబాద్ కు చెందిన మణికంఠ అనే వ్యక్తే ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. తాను ఎంతో కాలంగా సత్తిపై దాడి చేసేందుకు ఎదురుచూస్తున్నానని..ఇప్పటికి సమయం కుదిరిందని మణికంఠ ఓ సందేశంలో పేర్కొన్నాడు. సత్తి తెలంగాణ భాషను అపహస్యం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. వీ6 ఛానల్ ద్వారా ఎంతో పాపులర్ అయిన బిత్తిరి సత్తి తర్వాత సినిమాల్లోనూ పలు పాత్రలు చేశారు.