Telugu Gateway
Cinema

హీరోయిన్ పై విమర్శల దాడి

బహుశా ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ ఈ స్థాయిలో అభిమానుల నుంచి దాడి ఎదుర్కొని ఉండదు. అభిమానులు ఎంతగా ప్రేమించారో...హీరోయిన్ చర్యలతో అంతే స్థాయిలో విమర్శల దాడి మొదలుపెట్టారు. ఇలా విమర్శల దాడిని ఎదుర్కొంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా?. కోలీవుడ్ లో సంచలన నటిగా పేరుగాంచిన అతుల్య రవి. ఆమె నటించిన కాదల్ కన్‌ కట్టుదే సినిమాతో కుర్రకారులో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ కుర్రభామ. ఈ ప్రేమకథా చిత్రం ఘన విజయం సాధించటంలో ఆమెదే కీలక పాత్రకావటంతో అదే స్థాయిలో క్రేజ్ పెరిగింది. చాలా పద్ధతిగా నటించిందంటూ విమర్శకులు సైతం ఆమెపై ప్రశంసలు కురిపించారు. కట్ చేస్తే... ఐదు రోజుల క్రితం ఆమె నటించిన కొత్త చిత్రం యెమాలి చిత్ర టీజర్ విడుదల అయ్యింది.

అందులో ఆమె ఎక్స్ పోజింగ్ చూసిన వాళ్లంతా షాక్ కు గురయ్యారు. అది చూసిన వారంతా సోషల్ మీడియాలో అతుల్య రవి అసభ్య పదజాలంతో దూషిస్తూ ట్రోల్ చేయసాగారు. దీంతో ఆమె స్పందించి తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. టీజర్లో తన క్యారెక్టరైజేషన్‌ను చూసి తప్పుగా అనుకోవద్దని.. పాత్రకు అనుగుణంగానే తాను అలా నటించాల్సి వచ్చిందని తెలిపింది. పైగా యాధృచ్ఛికంగా అవి చిత్రీకరణ జరిగాయంటూ చెప్పింది. సినిమాలో ఆ సన్నివేశాలు ఉండబోవని చెబుతూ తనను అభిమానించేవారికి క్షమాపణలు తెలియజేసింది.

Next Story
Share it