Telugu Gateway
Cinema

అనుష్క చెప్పిన ప్రేమ క‌థ ఇది

అనుష్క‌. టాలీవుడ్ లో ఆ పేరు చెపితేనే ఓ ర‌క‌మైన వైబ్రేష‌న్స్ రావ‌టం ఖాయం. అందానికి అందం..అభిన‌యానికి అభిన‌యం. అన్నీ క‌ల‌బోస్తే అనుష్క అని చెప్పొచ్చు. అనుష్క పెళ్ళి గురించి అయితే మెయిన్ లైన్ మీడియా దగ్గ‌ర నుంచి వెబ్ మీడియా వ‌ర‌కూ ఎన్ని వార్త‌లు రాయాలో అన్నీ రాసేశారు. ఈ మ‌ధ్యే అనుష్క‌, ప్ర‌భాస్ పెళ్ళి చేసుబోతున్నార‌నే వార్త నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేసింది. ఇదంతా పాత క‌థే. ఇప్పుడు అనుష్కే త‌న ప్రేమ క‌థ గురించి చెప్పింది. ఈ వార్త ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఓ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్యూలో అస‌లు గుట్టు విప్పింది. ఓ అభిమాని మీ ఫేవ‌రెట్ క్రికెట‌ర్ ఎవ‌రు అని ప్ర‌శ్నించ‌గానే ఈ భామ ఎంతో త‌న్మ‌య‌త్వంతో స‌మాధానం చెప్పేసింది.

ద్రవిడ్ అంటే తనకు చిన్నప్పటి నుంచీ ఎంతో ఇష్టమని, క్రమంగా ఆయనతో ఆకర్షణలో పడిపోయానని తెలిపింది. ఆయన ఆటతీరు చూసి ఒక దశలో ద్రవిడ్‌తో ప్రేమలో కూడా పడిపోయానని చెప్పింది. అనుష్క స్వస్థలం కర్ణాటకలోని మంగళూరు. రాహుల్ ద్రవిడ్ కూడా కర్ణాటకకు చెందిన వాడే అన్న సంగతి తెలిసిందే. గ‌త కొంత కాలంగా సైలంట్ అయిపోయిన స్వీటీ ఈ మ‌ధ్యే భాగ‌మ‌తి వార్త‌ల‌తో మళ్ళీ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఫ‌స్ట్ లుక్ లో ఎంతో స్లిమ్ గా క‌న్పించిన ఈ భామ..త‌ర్వాత మ‌రో ఫోటోలో మామూలుగానే క‌న్పించింది.

Next Story
Share it