భాగమతి భయపెడుతోంది
టాలీవుడ్ లో బహుశా అనుష్క చేసినన్ని విభిన్నపాత్రలు ఎవరూ చేసి ఉండరేమో. ఓ వైపు గ్లామర్ పాత్రల్లో దుమ్మురేపుతూనే..మరో వైపు అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రల్లో నటించి సూపర్ సక్సెస్ లు అందుకున్న వారిలో అనుష్క ముందు వరసలో ఉంటారు. అందుకు తాజా ఉదాహరణ బాహుబలి తొలి, రెండవ భాగాలు. తొలి భాగం బాహుబలిలో పూర్తి డీగ్లామర్ పాత్రలో నటించి..బాహుబలి 2లో మాత్రం గ్లామర్ రోల్ తో ఆలరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె నటిస్తున్న భాగమతి సినిమా కూడా విభిన్న తరహాలో ఉన్నట్లు కన్పిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. ఇది చూసిన వారంతా మరో సారి అనుష్క ఎందుకిలా అనే అనుకోకతప్పదు మరి.
అలా ఉంది అందులో. రక్తం మరక అంటిన సుత్తితో..రక్తంతో తడిసిన దుస్తులతో అనుష్క పోరాడి అలసిన పోయిన పోజ్ లో కన్పిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ లో అనుష్క చాలా స్లిమ్ అయినట్లు కన్పిస్తోంది. సైజ్ జీరో సినిమా కోసం బాగా లావు అయిన స్వీటి తర్వాత ఇది తగ్గించుకోవటానికి నానా కష్టాలు పడటంతో పాటు రాజమౌళితో తిట్లు కూడా తినాల్సిన వచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి 2 కంటే భాగమతిలో బాగా స్లిమ్ అయినట్లు ఈ చిత్రం చూస్తు తెలుస్తోంది. భాగమతి సినిమాను యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, ఆది పినిశెట్టి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.