Telugu Gateway
Cinema

కొత్త సంవత్సంలోనే అనుష్క ‘భాగమతి’

అనుష్క మరోసారి ప్రతిష్టాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదీ కొత్త సంవత్సరంలో. బాహుబలి 2 తర్వాత ఆమె నటించిన సినిమా ఇదే కావటం విశేషం. విడుదల తేదీపై పలు ఊహగానాలు వెలువడినా చిత్ర యూనిట్ విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చేసింది. ‘భాగమతి’ని వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

అశోక్‌ దర్శకత్వంలో అనుష్క ముఖ్యపాత్రలో రూపొందుతున్న సినిమానే ఈ ‘భాగమతి’.ఉన్ని ముకుందన్, జయరామ్, ఆషా శరత్, మురళీ శర్మ ఇందులో కీలక పాత్రలు చేశారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళంలో విడుదల చేయనున్నారు. ఫస్ట్‌ లుక్‌కి వచ్చిన స్పందన చాలా బాగుందని చిత్రబృందం చెబుతోంది.

Next Story
Share it