Telugu Gateway
Cinema

ఫేస్ బుక్ లో అల్లు అర్హ సందడి

అల్లు అర్జున్ కు తన ఫ్యామిలీ ఫోటోలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో షేర్ చేయటం అలవాటే. ఇప్పటికే పలుమార్లు తన కుమారుడు అల్లు అయాన్ తో కూడిన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసి తన ఫ్యాన్స్ ను కుషీ చేశాడు. ఇప్పుడు తాజాగా మరోసారి అదే పనిచేశాడు. కాకపోతే ఇప్పుడు తన కుమార్తె అల్లు అర్హ ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టాడు. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ పోటోలను భారీ ఎత్తున షేర్ చేస్తున్నారు.

ఈ ఫోటో కూడా చాలా క్యూట్ గా ఉంది. అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి తన కూతురు అర్హను కాళ్ళపై నిల్చోబెట్టుకుని తన్మయత్వం చెందుతుండగా..ఫోటో వైపు చూస్తూ అర్హ ముసిముసిగా నవ్వుతుంది. ఈ ఫొటోను చూసి అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్య సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే.

Next Story
Share it