అఖిల్ ‘హలో’ టీజర్ వచ్చేసింది
ఎప్పటి నుంచో అక్కినేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ‘హలో’ టీజర్ వచ్చేసింది. అఖిల్ తొలి సినిమా నిరాశపర్చటంతో అక్కినేని ఫ్యామిలీ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది. అందుకు మనం సినిమాతో మంచి హిట్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. టీజర్ లో ఎక్కువ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. చిన్నతనంలో విడిపోయిన ఇద్దరు స్నేహితులు.. పెద్దయ్యాక ఆ అమ్మాయిని వెత్కుకుంటూ అన్వేషణ కొనసాగించే యువకుడి పాత్రలో అఖిల్ కనిపించబోతున్నాడని హింట్ ఇచ్చేశారు.
అందులో అనూప్ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఇక చివర్లో అఖిల్ హల్లో అని చెప్పే సింగిల్ డైలాగ్ మాత్రమే ఉంది. జగపతి బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 22న హలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
హలో టీజర్ లింక్ ఇదే
https://www.youtube.com/watch?v=fpxBxp9QKrk