నమిత ‘పెళ్ళి సందడి’
బొద్దుగుమ్మ నమిత పెళ్ళి సందడి మొదలైంది. తెలుగుతో పాటు పలు సినిమాల్లో సందడి చేసిన ఈ భామ ఇఫ్పుడు పెళ్లి పీటలు ఎక్కనుంది. గతంలో నమిత పెళ్ళిపై పలు పుకార్లు షికార్లు చేసినా అవన్నీ భోగస్ అని తేలిపోయింది. ఈ సారి మాత్రం పుకార్లకు బ్రేక్ వేస్తూ నమిత నిజ జీవితంలో పెళ్ళి కూతురుగా మారిపోయారు. ఈ నెల 24న నమిత, వీరేంద్ర చౌదరీల వివాహం తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల ముందు నమితకు మెహందీ ఫంక్షన్ ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. నమిత చేతులకు మెహందీ పెట్టించుకుంటూ దిగిన ఫొటోలకు భారీగా లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. మెహందీ ఏర్పాట్లకు ముందు కుటుంబసభ్యులతో కలిసి నమిత డ్యాన్స్ చేసిన వీడియోలు నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
'ఇటీవల నాకోసం ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్ లో వీర్ నాకు ప్రపోజ్ చేశాడు. ఆ సమయంలో నేను ఎటూ తేల్చుకోలేకపోయా..! కానీ మా ఇద్దరి లక్ష్యాలు ఒకటే కావటం, ఇద్దరిలో ఆధ్యాత్మిక చైతన్యం ఉండటం మమ్మల్ని దగ్గర చేసింది. అంతేకాదు ఇద్దరికి ప్రయాణాలు చేయటం ఇష్టం, ముఖ్యంగా ట్రెక్కింగ్ అంటే ఇష్టం. ఇద్దరం జంతువులను ప్రేమిస్తాం. ఇలా చాలా విషయాల్లో ఇద్దరి ఆలోచనా విధానం ఒకటే కావటంతో నేను నో చెప్పలేకపోయానంటూ' నటుడు, నిర్మాత వీరేంద్రతో తన ప్రేమకథను నటి నమిత వివరించారు.