హంగామాకు రెడీ అవుతున్న ‘ఆచారి’
BY Telugu Gateway11 Nov 2017 10:57 AM IST
Telugu Gateway11 Nov 2017 10:57 AM IST
మంచు విష్ణు హంగామా చేయటానికి రెడీ అవుతున్నాడు. ‘ఆచారి అమెరికా యాత్ర’ అంటూ సందడి చేయనున్నాడు. ఈ సినిమా చివరి షెడ్యూల్ ను పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకునే పనిలో పడింది. ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23 మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.
అమెరికా, మలేషియాల్లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రకరించినట్ల చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్లో కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళీ, పృథ్వీ, ప్రవీణ్, విద్యుల్లేఖా రామన్ లు నటించారు.
Next Story