Telugu Gateway
Top Stories

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలివే

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలివే
X

కరోనా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులు తెచ్చింది. ప్రపంచంలో ఏకంగా 130 నగరాల్లో జీవన ప్రమాణాలపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపించింది. 2020 సంవత్సరంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో హాంకాంగ్ మరోసారి నిలిచింది. జ్యురిక్, ప్యారిస్ లతో పాటు ఇది టాప్ టెన్ జాబితాలో నిలిచింది. సింగపూర్ నాల్గవ స్థానానికి పడిపోయింది. ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ జాబితాను సిద్ధం చేసింది. దీని ప్రకారం టాప్ టెన్ లోని నగరాల జాబితా ఇలా ఉంది. జ్యురిక్ (స్విట్జర్లాండ్), పారిస్ (ఫ్రాన్స్), హాంకాంగ్ (చైనా), సింగపూర్ (సింగపూర్) టెలి అవీవ్ (ఇజ్రాయెల్), ఒసాకా (జపాన్), జెనీవా (స్విట్జర్లాండ్), న్యూయార్క్ (అమెరికా), కోపెన్ హెగెన్ (డెన్మార్క్), లాస్ ఏంజెల్స్ (అమెరికా)లు ఉన్నాయి.

డాలర్ బలహీనపడటంతో అమెరికాలో వ్యయం ఒకింత తగ్గుముఖం పట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ధరలు పెరగ్గా, బట్టల ధరలు తగ్గుమఖం పట్టాయి. అమెరికా, ఆఫ్రికా, తూర్పు ఐరోపా దేశాల్లో వ్యయాలు తగ్గుముఖం పట్టాయి. పశ్చిమ యూరప్ లో మాత్రం ధరలు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థలు కోలుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య సమన్వయం ఎంతో అవసరం అని పేర్కొన్నారు.

Next Story
Share it