Telugu Gateway
Top Stories

దేశ ఐటి శాఖ మంత్రి ఖాతాను బ్లాక్ చేసిన ట్విట్ట‌ర్

దేశ ఐటి శాఖ మంత్రి ఖాతాను బ్లాక్ చేసిన ట్విట్ట‌ర్
X

కేంద్రం వ‌ర్సెస్ ట్విట్ట‌ర్ ఫైట్ లో కొత్త ట్విస్ట్. ట్విట్ట‌ర్ ఏకంగా దేశ ఐటి శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ట్విట్ట‌ర్ ఖాతానే గంట పాటు బ్లాక్ చేసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే వెల్ల‌డించారు. ఇది పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. "యుఎస్ఎ డీజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టాన్ని" ఉల్లఘించార‌నే ఆరోపణతో శుక్ర‌వారం నాడు దాదాపు గంటపాటు ఈ ఖాతాను బ్లాక్ చేసింది. మళ్లీ గంట తర్వాత తన ఖాతాను అన్ బ్లాక్ చేసినట్లు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ట్విటర్‌ చర్యలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డీజిటల్ మీడియా నైతిక నియమావళి) 2021 రూల్ 4(8) నియమాలను ఉల్లగించినట్లు ఆయన తెలిపారు. నిబందనల ప్రకారం ఖాతాను బ్లాక్ చేసే ముందు అతనికి ముందస్తు నోటీసు ఇవ్వడంలో విపలమైనట్లు పేర్కొన్నారు.

'నేను పోస్ట్‌ చేసిన నా టీవీ ఇంటర్వ్యూ వీడియోలపై గత కొన్నేళ్లుగా ఏ టెలివిజన్‌ ఛానల్‌ గానీ కాపీరైట్‌ ఫిర్యాదులు చేయలేదు. ఫిర్యాదులు వచ్చినందువల్లే ఖాతాను నిలిపివేసినట్లు ట్విటర్‌ చెబుతుంది. నిజానికి ట్విటర్‌ కు వ్యతిరేకంగా తాను మాట్లాడటంతోనే తన ఖాతాను బ్లాక్‌ చేసి ఉండవచ్చు'' అని ఇండియా కూ యాప్ లో కేంద్రమంత్రి పోస్ట్ చేశారు."నూతన ఐటీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించడానికి ట్విట్టర్ ఎందుకు నిరాకరిస్తో౦దో ఇప్పుడు స్పష్టమవుతో౦ది. ఎ౦దుక౦టే ట్విటర్ అనుసరిస్తే, తమ ఎజెండాకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తుల ఖాతాలను ఏకపక్షంగా నిలిపివేయడం ఉండదు కదా.." అని భారతీయ సోషల్ మీడియా వేదిక 'కూ'లో ట్విటర్ పై వరుస వ్యాఖ్యలతో మంత్రి విమ‌ర్శ‌లు గుప్పించారు.

Next Story
Share it