Telugu Gateway
Top Stories

మాస్క్ లేకపోతే విమానం దింపేస్తారు

మాస్క్ లేకపోతే విమానం దింపేస్తారు
X

కరోనా తగ్గుముఖం పడుతుంది అని అందరూ రిలాక్స్ అవుతున్న తరుణంలో దేశంలో మళ్ళీ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ పోతోంది. దీంతో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) విమాన ప్రయాణికులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విమానంలో మాస్క్ తప్పనిసరి ధరించాల్సిందే. అది కూడా ముక్కు కూడా పూర్తిగా కవర్ అయ్యేలా ఉండాలి. ఎవరైనా కోవిడ్-19 నిబంధనలను సరిగ్గా పాటించకపోతే ప్రయాణీకులను దింపేస్తామని డీజీసీఏ స్పష్టం చేసింది. గత కొంత కాలంగా దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే పలు రాష్ట్రాలు ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల దగ్గర కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతి ఇస్తున్నాయి.

కోవిడ్ నిబంధనలు పాటించే విషయంలో పదేపదే హెచ్చరికలు చేసినప్పటికీ ప్రయాణీకులు ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తే, ఆ ప్రయాణీకుడిని ' నిషేధిత జాబితాలో చేరుస్తామని డీజీసీఏ హెచ్చరించింది. విమానాశ్రయం నుంచి ప్రయాణికులు రాకపోకలు చేసే సమయంలో, విమానాశ్రయంలో ఉన్నంంతసేపు అన్ని సమయాల్లో మాస్క్‌ లను కచ్చితంగా ధరించాల'ని పేర్కొంది. విమానశ్రయ ప్రాంగణంలో కొంతమంది భౌతికదూరాన్ని పాటించడం లేదని తెలిపింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయాణీకులు మాస్క్‌ లను తీయవద్దని డీజీసీఏ సూచించింది. విమానశ్రాయ ఎంట్రీలో మోహరించిన సిఐఎస్ఎఫ్ , ఇతర పోలీసు సిబ్బంది మాస్క్‌ ధరించకుండా ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరీనీ అనుమతించకుండా చూసుకోవాలని తెలిపింది.

Next Story
Share it