Telugu Gateway
Top Stories

ఒక్క రోజులో 4 .35 లక్షల మంది విమాన ప్రయాణికులు

ఒక్క రోజులో 4 .35 లక్షల మంది విమాన ప్రయాణికులు
X

రికార్డు స్థాయిలో విమానాలు ఎక్కారు. ఒక్క రోజులో 4 .35 లక్షల మంది ప్రయాణికులతో దేశ విమానయాన రంగం కొత్త చరిత్ర నమోదు చేసింది. ఇప్పటివరకు దేశ చరిత్రలో ఇదే రికార్డు. ఇంత వరకు ఈ సంఖ్య 4.2 లక్షలుగా ఉంది. అది కూడా కరోనా రాక ముందు. ఈ కీలక ఘటన డిసెంబర్ 24 న నమోదు అయినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది. విమాన టికెట్ ధరలు అధికంగా ఉన్నా..అధిక ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఏవి విమానయాన రంగంపై ప్రభావం చూపించలేదని ఎయిర్ లైన్స్ భావిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ తో పాటు ఆర్థిక రాజధాని ముంబై విమానాశ్రయంలోనే పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడిన విషయం తెలిసిందే.

నూతన ఏడాది ఉత్సవాల కోసం ప్రజలు పలు ప్రాంతాలకు వెళ్ళటం. ఏడాది చివరిలో అందరు సెలవులు పెట్టి టూర్లు ప్లాన్ చేసుకోవటం సాధారణమే. అందుకే ఈ నెలలో విమానాశ్రయాలు కిటకిటలాడిన విషయం తెలిసిందే. అయితే ఇటు దేశీయ విమానయాన రంగం తో పాటు అంతర్జాతీయంగా కూడా అంతా గాడిన పడుతున్న వేళ చైనా, అమెరికా తో పాటు పలు దేశాల్లో మళ్ళీ కరోనా కేసు లు భారీగా పెరగటం కొంత ఆందోళన కలిగించే పరిణామంగా ఉంది.

Next Story
Share it